రక్షా బంధన్ రోజున సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు శుభ, అశుభ సమయంతో పాటు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. ఎలా కట్టాలి? ఏ సమయంలో కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకోవాలి.పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 1:35 నుండి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. సోదరుడి మణికట్టుకు రక్షా సూత్రం కట్టేటప్పుడు మూడు ముడులు కట్టాలి. ఈ ముడులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నాలుగా పరిగణిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోదరుడికి ఎప్పుడూ కుడి చేతికి రాఖీ కట్టాలి. ఎడమ చేతికి పొరపాటున కూడా కట్టకూడదు. కుడి చేయి అనేక పనులతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ చేతికి రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం దక్షిణం వైపు ఉండకూడదని గుర్తుంచుకోండి. అలాగే నలుపు రంగు రక్షా సూత్రం వినియోగించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు చాలా శుభకరమైనవి. అలాగే రాఖీ కట్టిన సోదరికి తప్పనిసరిగా బహుమతి ఇవ్వడం మంచిది..
Share