Current Date: 06 Oct, 2024

ప్రభాస్‌ను అవమానిస్తూ జోకర్‌తో పోల్చిన బాలీవుడ్ నటుడు

బాహుబలి సినిమాతో బాలీవుడ్‌ హీరోలకి గట్టి పోటీదారుడిగా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై  హిందీ హీరోలు, నటులు నోరుజారడం కామన్‌గా మారిపోయింది. ఈ ఏడాది విడుదలైన కల్కి సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్లలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కానీ  బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఈ మూవీపై అభ్యంతకర కామెంట్స్ చేస్తూ  ప్రభాస్‌ను జోకర్‌తో పోల్చాడు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా తనకు అస్సలు నచ్చలేదని చెప్పుకొచ్చిన అర్షద్   సినిమాలో ప్రభాస్ జోకర్‌లా కనిపించాడు అంటూ వెటకారం చేశాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అర్షద్‌పై ఆన్ లైన్ వార్ ప్రకటించారు.ప్రభాస్‌ను ఇటీవల హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా అవమానించింది. అతనితో సినిమా చేయనని తెగేసి చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్‌పై ఒక్క వివాదం కూడా లేదు. ఏ స్టేజ్‌పై కూడా ఏ ఒక్కరిని అతను అవమానించింది లేదు. కానీ.. ప్రభాస్ ఎదిగిన తీరు చాలా మందికి అసూయ తెప్పిస్తోంది. దాంతో నోరు జారుతూ అవమానిస్తున్నారు. అయినప్పటికీ ప్రభాస్ స్పందించలేదు.  ఇకపై స్పందించడు కూడా.

Share