నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే బాలకృష్ణ సాయం చేశారు. కడియపులంకలో పూలకుండీల షాపులో రాజ్‌కుమార్ పాండే మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఇటీవల తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. అయితే పాప పరిస్థితిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల బాలకృష్ణకు కాల్ చేసి చెప్పారు. పాప తండ్రి ఆర్థిక పరిస్థితిని వివరించి చిన్నారి వైద్యానికి సాయం చేయాలని కోరారు. దాంతో పాపను హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి బాలయ్య సిఫారసు చేసి సత్వర వైద్యం అందించాల్సిందిగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి సూచించారు. నందమూరి బాలకృష్ణ గతంలోనూ ఇలా చాలా మందికి సాయపడ్డారు. నిజానికి బయట బాలయ్య చాలా దురుసుగా ఉంటాడనే అభిప్రాయం ఉంది. అతని స్పీచ్‌ల విషయంలోనూ ట్రోల్స్ నడుస్తుంటాయి. కానీ సాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ బాలయ్య ముందుంటారు. కానీ చెప్పుకోవడానికి మాత్రం ఇష్టపడరు.