రోజుల్లో అంతా అవినీతిమయం అయిందని మాజీ ఎంపీ చింతామోహన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా.. రాజకీయాలు అవినీతితో నిండిపోయాయన్నారు. డబ్బు సంపాదనే రాజకీయంగా నేడు మారిపోయిందన్నారు. ప్రతిపక్ష నేతలకు కేసులు, అరెస్టులతో భయబ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ లో కూడా నేడు అవినీతి పేరుకుపోయిందన్నారు. నిజం చెప్పండి బీజేపీ నేతలు కూడా అవినీతికి పాల్పడడం లేదా? ప్రజాధనం లూటీ చేయడం లేదా? అని చింతామోహన్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణా మాజీ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తెను జైలులో పెట్టారని, అయితే ఆమె అవినీతికి పాల్పడలేదని తాను చెప్పడం లేదన్నారు. కేజ్రీవాల్‌ను కూడా జైలులో పెట్టారన్నారు. అవినీతి పేరు చెప్పి ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తున్నా బీజేపీ తమ పార్టీ ఎంత న్యాయమార్గంలో వెళుతుందో ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. పెద్ద పెద్ద అవినీతి నేరాలకు పాల్పడినా బీజేపీ నేతలకు మాత్రం ఎలాంటి శిక్షలు, కేసులు లేకుండా పోతున్నాయని చింతా మోహన్ అన్నారు. ఇదంతా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మహిమ అన్నారు.