అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య గత ఆరు నెలల నుంచి కోల్డ్ వార్ జరుగుతోంది. రీసెంట్గా 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ టైంలోనూ మెగా హీరోలు ఎలాంటి ట్వీట్స్ లేకుండా సైలెంట్‌గా ఉండటం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి టైంలో చిరంజీవి గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'పుష్ప 2' ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్.. 'అన్‌స్టాపబుల్ 4' షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి గురించి చర్చ రాగా.. అల్లు అర్జున్ డీటైల్డ్‌గా కొన్ని విషయాలు చెప్పాడు. 'గత ఇరవై ఏళ్లుగా నాకు చిరంజీవితో ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కానీ అంతకుముందు ఇరవై ఏళ్లు ఆయనతో నా బాండింగ్ ఎలా ఉందో ఎప్పుడూ చెప్పుకొనే సందర్భం రాలేదు. కాబట్టి ఇప్పుడు పంచుకుంటాను. ఓ మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్‌కి అభిమానిగా మారాను.నేను చిన్నగా ఉన్నప్పుటి నుంచి మామయ్య ప్రభావం నాపై చాలా ఉంది. ఎందుకంటే అప్పట్లో విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఆ టైంలో చిరంజీవి ఆయన పిల్లలతో పాటు నన్ను, శిరీష్‌ని కలిసి మొత్తం 10 మందికి పైగా పిల్లల్ని ఫారిన్ ట్రిప్‌కి తీసుకెళ్లేవారు.