పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా ధూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు.రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీమ్ ద్వారా టాలీవుడ్‌లోని పలువురు దర్శకులకి సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తుంది. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్లో రోజా బిజీగానే ఉన్నారు. 2013లో ఆమె టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పారు. అప్పటి నుంటి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.కానీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్‌లో మాత్రం పాల్గొనేవారు.