Current Date: 07 Oct, 2024

బిగ్‌బాస్‌ 8 దిమ్మతిరిగే అప్‌డేట్.. ట్విస్ట్ ఏంటంటే..?

బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. కొన్ని చోట్ల ఈ షోపై నెగెటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ సక్సెస్ ఫుల్ రన్ అయితే కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈ సారి జరగబోయే బిగ్ బాస్ 8 మరింత స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇందులో పాల్గొనబోయే పార్టిసిపెంట్ ఆషామాషీ వ్యక్తి కాదని చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు... సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ పాపులర్ అయిన వేణుస్వామి. అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామి తీసుకుంటున్నారట.

Share