ప్రభుత్వ సలహాదారులుగా ఇటీవల నియమితులైన ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశం అనంతరం చాగంటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలనీ, విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అదే సమయంలో లోకేష్ తో కలిసి విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నానన్న చాగంటి తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాగంటి కోటేశ్వరరావు తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Share