Current Date: 04 Jul, 2024

విశాఖకు పే..ద్ద ఓడ! ..

విశాఖలో పే..ద్ద ఓడ్ట కనిపించింది. ఇక్కడి పోర్టు ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ టెర్మినల్‌కు ఆదివారం ‘ది వరల్డ్‌’ అనే అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక రావడంతో విశాఖ వాసులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. విశాఖ పోర్టుకు ఇంత పెద్ద అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక రావడం ఇదే తొలి సారి అని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకకు విశాఖ పోర్టు అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దాదాపు 80మంది ప్రయాణికులతో ఈ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ నౌకలోని ప్రయాణికులు ఆదివారం విశాఖలోని పలు పర్యాటక ప్రాంతాల్ని సందర్శించనున్నారు. సోమవారం రాత్రి విశాఖ పోర్టు నుంచి ఈ నౌక పోర్ట్‌ బ్లెయిర్‌కు బయల్దేరనుందని అధికారులు తెలిపారు.