Current Date: 05 Oct, 2024

ఎలుగుబంట్లు ఇలా ఎక్కేస్తాయా....

గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, అడవుల్లోకి వెళ్లినా.. అప్పుడప్పుడు ఎలుగు బంట్లు కనిపించడం మామూలే. సాధారణంగా ఎలుగు బంట్లుగానీ, ఇతర అడవి జంతువులుగానీ ఎదురైతే.. ఏదైనా పెద్ద చెట్టు చూసుకుని ఎక్కేయాలని చెబుతూ ఉంటారు. కానీ అలా చెట్టు ఎక్కినా పెద్దగా లాభమేం లేదంటూ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తాజాగా ఓ వీడియో పోస్టు చేశారు.ఒక పెద్ద ఎలుగు బంటి, దానిపిల్ల రెండూ ఓ చెట్టు పై నుంచి దిగుతూ కనిపిస్తున్నాయి. కాసేపటికే మరో చెట్టు ఎక్కడం కూడా మొదలుపెట్టాయి. ఉత్తరప్రదేశ్ లోని హిమాలయ పర్వాతాల సమీపంలోని అడవుల్లో తీసిన ఈ వీడియోను పర్వీన్ కాస్వాన్ తాజాగా పోస్ట్ చేశారు. చిన్నప్పుడు ఎలుగుబంట్లు కనిపిస్తే వెంటనే దగ్గరిలోని ఎత్తయిన చెట్లు ఎక్కాలని కథల్లో చెప్పేవారు. అలా కాపాడుకున్న చిన్నారులు అంటూ పాఠాలు కూడా ఉండేవి. అది  సరికాదని ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. హిమాలయన్ బ్లాక్ బేర్, దాని పిల్ల రెండూ చెట్లు ఎలా ఎక్కుతున్నాయో చూడండి.ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. వేల కొద్దీ వ్యూస్ , లైకులు కూడా వస్తున్నాయి.ఎలుగుబంట్లు ఇలా చెట్లు ఎక్కేస్తే ఇక కాపాడుకోవడం ఎలాగంటూ కామెంట్లు కూడా  వస్తున్నాయి