Current Date: 04 Jul, 2024

ఒక్క నెలలో 7 కేజీలు తగ్గా, తీవ్ర అనారోగ్య సమస్య ఉండొచ్చన్న అర్వింద్ కేజ్రీవాల్...

తాను ఒకే నెలలో 7 కేజీలు తగ్గానని ఇది ఆందోళనకరమని ఆఫ్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకేదైనా తీవ్ర అనారోగ్యం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.నా బరువు చాలా తగ్గింది. ఒక నెలలో అకారణంగా ఏడు కేజీల బరువు తగ్గినట్టైతే ఏదైనా సీరియస్ సమస్య ఉన్నట్టు అనుమానించాలి. డాక్టర్లు నాకు కొన్ని వైద్య పరీక్షలు సూచించారు. ఇందుకు ఏడు రోజులు పడుతుందని అన్నారు’’ అని కేజ్రీవాల్ కోరారు. జూన్ 1తో ఆయన బెయిల్ గడుస్తున్న నేపథ్యంలో మరో ఏడు రోజుల గడువు పొడిగింపు కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఏదైనా తీవ్ర సమస్య ఉన్నదీ లేనిదీ టెస్టుల తరువాతే తెలుస్తుందని వైద్యులు చెప్పినట్టు కేజ్రీవాల్ మీడియాతో అన్నారు.కేజ్రీవాల్ రక్తంలో కీటోన్ బాడీలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఆప్  తెలిపింది. పీఈటీ-సీటీ స్కాన్ తోపాటు కేజ్రీవాల్ అనేక ఇతర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని పేర్కొంది.