లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఇక పోటీనే మిగిలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.లోక్‌సభ చరిత్రలో స్పీకర్ పదవికి ఇప్పటి వరకూ ఎన్నిక జరగలేదు. ప్రతిసారీ అధికార పార్టీ అభ్యర్ధి స్పీకర్‌గా ఏకగ్రీవం కావడం, డిప్యూటీ పదవి ప్రతిపక్షాలకు కేటాయించడం జరుగుతోంది. కానీ 2014లో మిత్రపక్షం అన్నాడీఎంకేకు చెందిన తంబిదురైను బీజేపీ డిప్యూటీ స్పీకర్‌గా ఎంచుకుంది. 2019లో ఈ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఇక ఈసారి అధికార పార్టీకు బొటాబొటీ మెజార్టీ రావడం, విపక్షాలకు దీటుగా ఉండటంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందిగ్దంగా మారింది.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు రెండింటినీ ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయిస్తే ఏకగ్రీవం ఓకే అని చెప్పినా అధికార పార్టీ ఒప్పుకోలేదు. దాంతో ఎన్నిక తప్పడం లేదు. 72 ఏళ్ల పార్లమెంటరీ చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండటం ఇదే తొలిసారి.
Share