బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఐదు కోట్ల రూపాయల మేర చెల్లించకపోతే సల్మాన్ కు సిద్ధిఖ్ పరిస్థితే అంటూ హెచ్చరికలు వచ్చాయట.బిష్ణోయ్ గ్యాంగ్ ఇలా సల్మాన్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక డబ్బు ప్రమేయం లేదని అంటున్నాడు లారెన్స్ బిష్ణోయ్ కజిన్ ఒకడు. లారెన్స్ తరఫున మీడియాతో మాట్లాడుతూ.. సల్మాన్ తో బిష్ణోయ్ గ్యాంగ్ డబ్బు డిమాండ్ చేయడం లేదన్నాడు. చాలా యేళ్ల కిందటే సల్మాన్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెక్ కాదు, చెక్ బుక్ నే ఆఫర్ చేశాడట.ఒక చెక్ కాకుండా, మొత్తం బుక్ ఇచ్చి ఎంత రాసుకుంటారో రాసుకోవచ్చని సల్మాన్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడట. అయితే బిష్ణోయ్ గ్యాంగ్ ఆ ప్రపోజల్ ను తిరస్కరించిందని లారెన్స్ కజిన్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.