Current Date: 04 Jul, 2024

కౌంటింగ్ పరిసరాల్లో పిన్నెల్లి కనిపించకూడదు..

న్యూసీదర్ కౌటింగ్ పరిసరాల్లో చీరాల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనబడడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ విధంగా ఒప్పుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ బూత్లో ఈవీఎంను ద్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు రక్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దీన్ని సవాలు చేస్తూ నంబూరి శంకర్రావు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం హైకోర్టును తప్పు పట్టింది. ఇది న్యాయాన్ని అవహేళన చేయడమే నంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణ, జవ్వాది శధరత్లు వాదనలు వినిపిస్తూ ఎన్నికల కమిషన్కి సంబంధించిన వెబ్కాస్టింగ్ వీడియోలను ధర్మాసనానికి చూపించారు. దీనిపై స్పందించిన సుప్రీం పిన్నెల్లి తరపున వాదిస్తున్న న్యాయవాదిని ఉద్దేశించి దీనికి మీ సమాధానం ఏమిటి ? అంటూ ప్రశ్నించింది. దీనిపై తను ఏమీ అనదలచుకోలేదని చెప్పడంతో కోర్టు తన తీర్పును వెలువరించింది. తదుపరి విచారణలో అన్ని విషయాలనూ పరిగణించి మాత్రమే హైకోర్టు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీం సూచించింది.