భారత క్రీడారంగంలో సానియా మీర్జా, మొహమ్మద్ షమీ ఇద్దరూ మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రీడాకారులే. కెరీర్‌పరంగా ఎంత సక్సెస్ అయినా ఇద్దరి వైవాహిక జీవితం మాత్రం సాఫీగా సాగలేకపోయింది. ఈ ఇద్దరి విషయంలో గత కొద్దికాలంగా వస్తున్న వార్తలపై సానియా మీర్జా తండ్రి స్పందించారు.సానియా మీర్జా భారతదేశపు అత్యున్నత మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. మొహమ్మద్ షమీ టీమ్ ఇండియా టాప్ పేసర్. వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియాను ఫైనల్‌కు చేర్చిన బౌలర్. గత కొద్దికాలంగా ఈ ఇద్దరి మధ్య బంధం నడుస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ ఇద్దరి వైవాహిక జీవితంలో ఎదురైన ఇబ్బందులు కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా మీర్జా ఈ ఏడాది ప్రారంభంలో అతనితో విడాకులు తీసుకుంది. అటు మొహమ్మద్ షమి గత కొద్దికాలంగా భార్య హసీన్ జహాన్‌తో విబేధాల నేపధ్యంలో విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మొహమ్మద్ షమి, సానియా మీర్జాలు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దాంతో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ ఈ వార్తలపై స్పందించక తప్పలేదు. ఇవన్నీ అబద్ధాలును తన కుమార్తె సానియా కనీసం అతడిని ఒక్కసారి కూడా కలవలేదని స్పష్టం చేశారు. అదే పనిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు.ప్రస్తుతం సానియా మీర్జా తన పూర్తి సమయాన్ని కుమారుడు ఇజహాన్ ఆలనా పాలనా చూసుకునేందుకు కేటాయించింది. అటు వృత్తిపరంగా కూడా బిజీ అవుతోంది. మొత్తానికి గత కొద్దికాలంగా వ్యాపిస్తున్న పుకార్లకు సానియా తండ్రి చెక్ పెట్టారు.v