Current Date: 02 Jul, 2024

బాలయ్యతో మందుకొట్టి నోరుజారిన యంగ్ హీరో.. వైరల్

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ఇచ్చిన స్పీచు, విశ్వక్ సేన్ ప్రసంగం ఒకెత్తు అయితే.. హైపర్ ఆది ఇచ్చిన ఎలివేషన్లు ఒకెత్తు. ఇవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు విశ్వక్ సేన్ ఇచ్చిన స్పీచులోని తప్పులు, బాలయ్య అంజలిని తోసేయడం, ఆ ఈవెంట్లో వాటర్ బాటిల్లోనే మందు కలుపేసుకుని బాలయ్య తాగాడంటూ ఇలా నానా రకాల వివాదాలు చుట్టుముట్టాయి.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తన ఫలక్ నుమా దాస్ మూవీ ఐదేళ్ల క్రితం మార్చి 31 విడుదలైందని చెప్పాడు. కానీ అది మే 31.. మే అనబోయి మార్చి అన్నాడు. ఇక మరో సందర్భంలో హీరోయిన్ గురించి చెబుతూ.. బాషా సినిమాలో రమ్యకృష్ణ వేసిన నీలాంబరి పాత్రకు ఎంత పేరు వచ్చిందో.. ఈమె పాత్రకు కూడా అంతే మంచి పేరు వస్తుందని తప్పుగా చెప్పాడు. నరసింహా సినిమా అయితే బాషా అని చెప్పడంతో మళ్లీ అక్కడ దొరికిపోయాడు.ఇక ఈ తప్పుల్ని కలిపి కొందరు మీమ్స్, ట్రోల్స్ చేశారు. విశ్వక్ నటించిన ఈ నగరానికి ఏమైంది మూవీలోని డైలాగ్‌నే వాడుకున్నారు. అయితే ఇలా తన మీద వచ్చిన మీమ్, ట్రోల్‌‌కు విశ్వక్ రిప్లై ఇచ్చాడు. నరసింహా అని తెలుసు.. కానీ ఎందుకు అలా చెప్పానో తెలియడం లేదు.. ప్రామీస్‌కు మందు మాత్రం తాగలేదు అని క్లారిటీ ఇచ్చాడు.