ఢిల్లీ సీఎం జైల్లో ఉన్నారు.తాజాగా సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. తీహార్ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టు ముందు ఆయనను సీబీఐ అధికారులు హాజరుపరిచారు. ఆయనను ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరగాకోర్టు కేజ్రీవాల్ ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తిని కేజ్రీవాల్ ఒక వింత కోరిక కోరారు. తన బెల్టును జైలు అధికారులు తీసేసుకున్నారని.. దీంతో తన ప్యాంటు జారిపోతోందని కేజ్రీవాల్ న్యాయమూర్తికి నివేదించారు, దీంతో ప్యాంటు జారిపోకుండా తాను చేత్తో ప్యాంటును పట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు. జైలు నుంచి కోర్టుకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ఇది తనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెల్టు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు కళ్లద్దాలు, మందులు, ఇంటి భోజనం, భగవద్గీత కాపీని అందించాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ప్యాంటు బెల్టును కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే తన సతీమణి సునీత, ఇతర బంధువులు రోజూ కేజ్రీవాల్ ను కలవడానికి అనుమతి మంజూరు చేసింది.
Share