ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలని.. సాయంత్రం 6 తర్వాత ఆఫీస్లో ఉండొద్దని సూచించారు. తాను కూడా సాయంత్రం 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని.. ఉద్యోగులు హార్డ్ వర్క్ వద్దని.. స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. గతంలో ఎక్కువ గంటలు కార్యాలయంలో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని.. ఇప్పుడు టెక్నాలజీ కారణంగా ఆ అవసరం లేదన్నారు. గత ఐదేళ్ల గురించి మర్చిపోదామనుకుంటున్నాను.. కాని ఆనాటి విధ్వంసం అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. నాలుగోసారి ముఖ్యమంత్రినైనా రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మించడానికి సమయం పడుతోంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా రహస్యంగా ఉంచారని.. తమ ప్రభుత్వం ప్రస్తుత జీవోలతో పాటు గత ఐదేళ్లవీ ఆన్లైన్లో పెడతామని చెప్పారు. ప్రజల్ని హింసించే వ్యక్తులు, శక్తులపై ఉదాసీనంగా వ్యవహరించినా సమాజానికి నష్టమే అన్నారు.
Share