Current Date: 21 Aug, 2026

6 మేయర్, 30 మున్సిపల్ చైర్మన్ స్థానాల కోసం : జనసేన పట్టు?

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ తమకు రావలసిన వాటాపై స్పష్టమైన ప్రతిపాదనలతో సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి ఉన్న ప్రజాదరణ, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాల ఆధారంగా స్థానిక పోరులో తగిన ప్రాతినిధ్యం కోరాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ర్చల్లో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 6 మేయర్ పీఠాలను జనసేన ఆశిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా, మొత్తం 78 మున్సిపాలిటీల పరిధిలో కనీసం 30 మున్సిపల్ చైర్మన్ స్థానాలను తమకు కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పీఠాలను దక్కించుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని జనసేన నాయకత్వం భావిస్తోంది. కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీతో కలిసి సీట్ల పంపిణీని సమ్మతంగా ముగించాలని ఇరు పార్టీల సీనియర్ నేతలు యోచిస్తున్నారు. జనసేన ప్రతిపాదించిన స్థానాల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.