Current Date: 06 Oct, 2024

భంగపడ్డ శ్రీలక్ష్మి

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి దయనీయంగా మారింది.సీఎం చంద్రబాబు ను కలవడానికి వెళ్లి భంగ పడిన శ్రీలక్ష్మి ఏమీ చేయలేక నవ్వుకుంటూ వెళ్లిపోతున్న వీడియో వైరల్ అవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో చేసిన తప్పుడు పనులకు జైలుకు వెళ్లి వచ్చినా ఈ ఐఏఎస్ అధికారికి బుద్ది రాలేదు. జగన్ ప్రభుత్వం లో  శ్రీలక్ష్మి హవా అంతా ఇంతా కాదు. మున్సిపల్ పరిపాలన లో  అనేక కుంభకోనణాలకు ఆమే కేంద్ర బిందువు. ఆమె పని ఆమె నిజాయితీగా చేసి ఉంటే ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అయి ఉండేవారు. అలాంటిది ముఖ్యమంత్రి దరి దాపులకు కూడా రానివ్వడం లేదు అంటే అందుకు ఆమే బాధ్యురాలు.రోజులన్నీ ఒకేలా వుండవు అని అందుకే అంటారు.

Share