Current Date: 01 Oct, 2024

టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ టీమ్ ఢమాల్ 59 ఏళ్ల తర్వాత చెత్త రికార్డ

బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు టెస్టు ర్యాంకింగ్‌లో రోజు రోజుకీ ప‌త‌న‌మైపోతోంది. సిరీస్‌కు ముందు 6వ స్థానంలో ఉన్న దాయాది టీమ్.. సిరీస్ ముగిసే సమయానికి 8వ స్థానానికి పడిపోయింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను షాన్ మ‌సూద్ సారథ్యంలోని పాక్ జ‌ట్టు 0-2 తేడాతో చేజార్చుకుంది. తొలి టెస్టులో పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లా, రెండో టెస్టులోనూ 6 వికెట్ల తేడాతో మట్టికరిపిచింది. దాంతో  ప్ర‌స్తుతం పాక్ ఖాతాలో కేవ‌లం 76 రేటింగ్ పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. దీంతో పాకిస్థాన్ 1965 త‌ర్వాత అత్యల్ప టెస్టు రేటింగ్ పాయింట్లతో బేలగా ప్రపంచం ముందు నిల్చొంది. రేటింగ్స్‌లో 124 పాయింట్ల‌తో ఆసీస్ మొద‌టి స్థానంలో ఉంటే, భార‌త్ (120), ఇంగ్లండ్ (108) ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌తో ఈ నెలలో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడనుంది.

Share