ఏవోబీలో అటవీ ప్రాంతంలో ప్రాంతంలో బెజ్జింగివాడ వద్ద మావోయిస్టులకు చెందిన ఆయుధ నిల్వలు ఉన్నాయని నిర్దిష్టమైన సమాచారంతో పోలీసు గాలిపందాలు సోదాలు చేపట్టాయి. గాలింపు చేస్తున్న బీఎస్ఎఫ్ బలగాలకు దూలగండి గ్రామ సమీపంలో ఉన్న పర్వత గుహలో మావోయిస్టులు డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నదికి సమీపంలో మల్కనగిరి జిల్లా కుర్మనూర పంచాయతీ దూలగండి అటవీప్రాంతంలో మావోయిస్టులకు చెందిన ఆయుధ నిల్వల స్థావరం గుర్తించారు. ఈ డంప్ లో ఎస్ఎంల్ తుపాకీలు మూడు, ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ మూడు, జిలెటెన్ స్టిక్స్-98, డైరక్షనల్ మైన్స్-2, సోలార్ ప్లేట్, గ్యాస్ సిలెండర్లు తో పాటు మందులు, తదితర సామాగ్రీ లభించాయి. మావోయిస్టులు కంచుకోటగా పేరున్న బెజ్జంగివాడ అటవీప్రాంతలో బీఎస్ ఎఫ్ పోలీసులు డంప్ స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి దెబ్బగా చెప్పవచ్చు.