Current Date: 26 Nov, 2024

విశాఖ పెద్దాస్పత్రిలో ఫైర్

 విశాఖ పెద్దాస్పత్రి కేజీహెచ్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి సీఎస్సార్ బ్లాక్ లోని మూడో అంతస్తులో దట్టమైన పొగ అలముకోవడంతో రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వైద్యులు అప్రమత్తమై ఐసీఆర్ యూలో చికిత్స పొందుతున్న 8మంది రోగుల్ని సమీప వార్డుల్లోకి తరలించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద పేర్కొన్నారు.

Share