ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఇక మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి రెండు టెస్టులు గెలిచిన కివీస్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌కు ఎసరు పడే అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా ఈ టెస్టులో గెలవాలని రోహిత్ సేన భావిస్తోంది.