Current Date: 26 Nov, 2024

ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్ హెచ్చరిక

విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. గతేడాది కూడా అతడు ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు. సిక్స్ ఫర్ జస్టిస్  వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీచేశాడు. ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడు.

Share