Current Date: 27 Nov, 2024

పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌

పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో  శుక్రవారం చంద్రబాబుతో టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ సచివాలయంలో  భేటీ అయ్యారు.   విశాఖలో టీసీఎస్‌ డెవలెప్‌మెట్‌ సెంటర్‌ ఏర్పాటుపై టాటా గ్రూపు చైర్మన్‌ నటరాజన్‌తో చర్చించినట్లు ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో తెలిపారు. ఏపీలో ఎయిర్‌ ఇండియా, విస్తారా ఎయిర్‌ లైన్స్‌ విస్తరణ అంశాలపై చర్చించారు.   సీఎం సమావేశం వివరాలను ట్విట్టర్‌లో వెల్లడిరచారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాధ్రప్రదేశ్‌- విజన్‌ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్దికి దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్‌ఫోర్స్‌   ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం చైర్మన్‌గా, టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ కో చైర్మన్‌గా టాస్క్‌ ఫోర్స్‌ ఉంటుందన్నారు. 

Share