Current Date: 02 Apr, 2025

ఐపీఎల్‌లో కింగ్‌లా పంజాబ్ బోణి.. పోరాడి ఓడిన గుజరాత్

ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్ బోణి అదిరిపోయింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ ఆఖరి వరకూ పోరాడినా.. 11 ప‌రుగుల తేడాతో పంజాబ్ విజ‌యం సాధించింది. 244 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టీమ్ 232 ప‌రుగులే చేయగలిగింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయిసుద‌ర్శ‌న్‌(74), జోస్ బ‌ట్ల‌ర్‌(54) రూథ‌ర్ ఫ‌ర్డ్‌(46) పోరాడిన‌ప్ప‌ట‌కి త‌మ జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చ‌లేక‌పోయారు. కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌(33) త‌న వంతు ప్ర‌య‌త్నం చేశాడు. కానీ కొండంత ల‌క్ష్యాన్ని క‌రిగించ‌లేక‌పోయారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌ రెండు, జానెస‌న్‌, మాక్స్‌వెల్ త‌లా వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో 97 పరుగులు చేశాడు. అయ్యర్‌తో పాటు శ‌శాంక్ సింగ్‌ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 44 పరుగులు చేశాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సాయికిషోర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Share