యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా విజయం పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ స్పందిస్తూ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ప్రభాస్ వంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు దక్కడంపై సంతోష్ శోభన్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తమ చిత్రానికి దక్కిన అసలైన సక్సెస్ అని ధీమా వ్యక్తం చేశారు. చిత్ర బృందంతో ప్రభాస్ జరిపిన చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్‌కు ప్రభాస్ తన ఫోన్ నంబర్ ఇవ్వడం విశేషం. "ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే కాల్ చెయ్, అనవసరంగా చేస్తే తంతా" అంటూ ప్రభాస్ తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యానించారు. అన్న ఫోన్ నంబర్ తన దగ్గర ఉండటం పట్ల సంతోష్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఇదే చిట్ చాట్‌లో ప్రభాస్ తన భోజన ప్రియత్వాన్ని చాటుతూ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 'ఆదిపురుష్' షూటింగ్ సమయంలో దర్శకుడు ఓం రౌత్ కోసం చెన్నై నుండి ఫ్లైట్‌లో స్పెషల్ ఫుడ్ తెప్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ బిర్యానీతో పోలిస్తే చెన్నై ఫ్లేవర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, ప్రభాస్ చేసిన ఈ పనికి ఓం రౌత్ ఆశ్చర్యపోయారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Share