Current Date: 25 Nov, 2024

రూ.40 కోట్లు పలికిన నెల్లూరు ఆవు.. స్పెషాలిటీ ఏంటంటే?

సాధారణంగా ఒక ఆవు ఖరీదు రూ.40 నుంచి 50 వేల వరకు ఉంటుంది. కానీ.. రూ.40 కోట్ల విలువైన ఆవు గురించి ఎప్పుడైనా విన్నారా? బ్రెజిల్‌లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన ఆవు ధర రూ.40 కోట్లు పలికింది.

ఐదు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండే తెల్ల రంగు ఆవు..  ఒకేసారి 10 నుండి 15 లీటర్ల పాలు ఇవ్వగలదు. ఆవు పేరు వయాటినా-19 ఎఫ్ఐవి. ఇది నెల్లూరు జాతికి చెందినది. బ్రెజిల్ దీన్ని 1868లో భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. 1960 సంవత్సరం నాటికి ఈ జాతి భారతదేశం నుండి బ్రెజిల్‌కు పెద్ద సంఖ్యలో చేరుకుంది.

ఏ వాతావరణానికైనా ఈ ఆవు తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న తరువాత బ్రెజిల్ ఈ జాతిని సంరక్షించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు బ్రెజిల్ ఇతర దేశాలకి నెల్లూరు సంతతిని ఎగుమతి చేస్తోంది.