Current Date: 26 Nov, 2024

బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 4న చైతూ, శోభితల వివాహాం..

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం జరగనుందట. శోభిత తల్లిదండ్రుల కోరిక మేరకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగబోతోందని చెపుతున్నారు. 4వ తేదీ రాత్రి 8.13 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం జరగనుంది. ఈ పెళ్లికి 300 మంది గెస్ట్ లు హాజరుకానున్నట్టు సమాచారం.

Share