విశాఖపట్నం వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ అభిమానులకి ఫుల్ మజాని ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో.. ఢిల్లీ గెలిచి బోణి కొట్టింది. వాస్తవానికి మ్యాచ్‌లో లక్నో గెలవాల్సి ఉంది. కానీ.. ఆఖరి ఓవర్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పిదం ఢిల్లీకి వరమైంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 209 పరుగులు చేయగా.. ఛేదనలో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ చిత్తుగా ఓడిపోయేలా కనిపించింది. కానీ.. అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసి ఢిల్లీని గెలిపించాడు. మరీ ముఖ్యంగా ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్లో 6 పరుగులు చేయాల్సిరాగా.. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఈ దశలో రిషబ్ పంత్ తప్పిదం చేశాడు. లాస్ట్ ఓవర్‌ని ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌తో కాకుండా స్పిన్నర్ షాబాజ్‌తో వేయించిన రిషబ్ పంత్.. తొలి బంతికే మోహిత్‌ను స్టంపౌట్ చేసే ఛాన్స్‌ని వేస్ట్ చేశాడు. దాంతో రెండో బంతికి మోహిత్ సింగిల్ తీయగా.. మూడో బంతికి అశుతోష్ సిక్స్ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. ఒకవేళ పంత్ స్టంపౌట్ చేసింటే.. ఢిల్లీ గెలిచేది.
Share