Current Date: 28 Nov, 2024

కేఏ పాల్ పిటిషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు...

పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉందని హైకోర్టు తెలిపింది. ఈ అంశంపై తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వెలువరించిన తీర్పులో పేర్కొన్నామని చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే సదరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించలేమని స్పష్టం చేసింది. 

Share