Current Date: 05 Oct, 2024

సూపర్ గ్లోబ్ సీజన్-3లో సత్తా చాటిన విశాఖ కుర్రాడు

విదేశాల్లో విశాఖ యువకుడు సత్తా చాటాడు. విశాఖ సీసీఎస్ సీఐ పీ. శోభన్ బాబు కుమారుడు యశ్వంత్ ప్రేమ మరోమారు అదర గొట్టాడు. ఈ నెల 7నుండి 10వ తేదీ వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగిన "సూపర్ గ్లోబ్ సీజన్ –3 ఫైనల్ లో యశ్వంత్ ప్రేమ (17)ఏపీకే పేరు తెచ్చాడు. తొలి రన్నర్గా నిలిచి తన ప్రతిభను చాటు కున్నాడు. తన అందం, ప్రతిభ, నైపుణ్యంతో అంత ర్జాతీయ పోటీల్లో న్యాయ నిర్ణీతల్ని కట్టిపడేసి విజేతగా నిలిచాడు. యశ్వంత్ ప్రేమ భారత్ ప్రతినిధిగా వరల్డ్ ఫైనల్స్ -2024 పోటీల్లో పాల్గొన్నాడు. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యూటీ ఈవెంట్ గా పేరు గాంచిన ఈ సూపర్ గ్లోబ్ (మిస్టర్ అండ్ మిసెస్ టీన్) సీజన్- 3లో విశాఖ వాసి తొలి రన్నర్ గా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలన్నారు. ఇటీవల కాలికట్ లో జరిగిన జాతీయ స్థాయిపోటీల్లోనూ ఆయన విజేతగా నిలిచాడు. ఇందులో ఏపీ ప్రతినిధిగా పాల్గొన్నానని, ప్రిన్స్ ఆఫ్ ఏపీ, ఇండియా- 2024 లో నిలిచానని గుర్తు చేశాడు.

Share