రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అమరావతిలో కల్కి కోసం గ్రాండ్ ఈవెంట్‌ను నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ చేశాడు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే మొదటి ఈవెంట్ ఇదే .కానీ.. అమరావతిలో ఈవెంట్ పెడితే రానని ప్రభాస్ చెప్పినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అక్కడ ఈవెంట్ పెడితే రాజకీయం అవుతుందని, అప్పుడు అభిమానుల మధ్య గొడవలు పెట్టినట్టు అవుతుందని, తన సినిమాకు ఇలా పొలిటికల్ టచ్ ఇవ్వొద్దంటూ అశ్వనీదత్‌కు క్లియర్‌గా చెప్పాడట.కల్కి సినిమాకు ఇప్పటి వరకు సరైన ఈవెంట్ గానీ ప్రమోషన్ గానీ జరగలేదు. నాగ్ అశ్విన్ అయితే ఏదో వీడియోలను వదిలి సినిమా గురించి చెబుతూ హైప్ ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ ఆ రేంజ్ సౌండ్ అయితే కనిపించడం లేదు.