Current Date: 26 Nov, 2024

ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా? రైల్వే కొత్త రూల్

ట్రైన్ జర్నీలో లోయర్ బెర్త్ ఓ బ్రహ్మ పదార్థం. సాధారణంగా వయసు మళ్లిన వారికి తప్ప ఆ బెర్త్ ఇతరులకి లభించడం చాలా అరుదు. ఒకవేళ ప్రయాణానికి చాలా రోజులు ముందు రిజర్వేషన్ చేసుకుంటే బెర్త్ లభిస్తుంది. అంతే తప్ప.. తాత్కాల్‌ ద్వారా రిజర్వేషన్ చేసుకుంటే లోయర్ బెర్త్ ఆశని ప్రయాణికుడు వదులుకోవాల్సిందే. అయితే.. గత కొన్ని రోజులుగా వృద్ధులకి కూడా లోయర్ బెర్తులు లభించడం లేదు. దాంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ అయిపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే రిజర్వేషన్‌, బెర్తుల కేటాయింపులో ఇండియన్‌ రైల్వే కొత్త రూల్‌ను అమలు చేసింది.లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్‌లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్‌ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సీనియర్ సిటిజన్‌లు లోయర్‌ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు.వయసు మళ్లిన వారు లోయర్‌ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపులు లభ్యతకు లోబడి ఉంటాయి. 

Share