తిరుమల తిరుపతి దేవస్థానంలో నవంబర్ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 1న కేదారగౌరీ వ్రతం, 3న భగినీహస్త భోజనం, శ్రీతిరుమలనంబి శాత్తుమొర, 5న నాగుల చవితి, పెద్దశేష వాహనం. 6న శ్రీమనవాళ మహామునుల శాత్తుమొర. 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ. 9న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలో కాచార్య వర్ష తిరు నక్షత్రం, పొయిగైయాళ్వార్ వర్ష తిరునక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర. 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రవం. 11న శ్రీయాజ్ఞ వల్క్య జయంతి. 12న ప్రబోధన ఏకాదశి. 13న కైశిక ద్వాదశి ఆస్థానం. చాతుర్మాస్య వ్రత సమాప్తి. 15న కార్తిక పౌర్ణమి. 28న ధన్వంతరి జయంతి. 29న మాసశివరాత్రి జరగనుంది.