Current Date: 06 Oct, 2024

గుంటూరు జిల్లా మంగళగిరి

సోషల్ మీడియా రీల్స్ మోజులో మంగళగిరి రోడ్లపై కొందరు ఆకతాయిలు  ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు విడిచిపెట్టే  సమయాల్లో రోడ్లపై బైక్స్ తో  విన్యాసాలు చేస్తూ రోడ్డు పక్కన వెళ్ళే విద్యార్థినుల పట్ల, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ,  తోటి వాహన చోదకులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు మంగళగిరి టిడ్కో సముదాయాలు, బైపాస్ రోడ్డు, వడ్డేశ్వరం నుండి ఎయిమ్స్ కు వచ్చే రోడ్డు ప్రాంతాల్లో యువకుల బైక్ విన్యాసాలతో పెట్రేగిపోతున్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా, సైలెన్సర్లు తీసివేసి ప్రమాదకరంగా బైక్లు నడుపుతూ పాదచారులను, వాహన చోదకులను బెంబేలెత్తిస్తున్నారు.పోలీస్ అధికారులు సదరు ఆకతాయిల ఆగడాలపై స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Share