మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాక్ ఓ మోస్తరు విజయం సాధిస్తే భారత్ సెమీస్‌కు చేరే అవకాశం ఉండేది. ఒకవేళ న్యూజిలాండ్‌ను భారీ తేడాతో ఓడిస్తే పాకిస్తానే సెమీస్‌కు చేరుకునేది. కానీ.. పాక్ 54 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. భారత్, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దాంతో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్‌కి చేరాయి.గత మూడు టీ20 వరల్డ్‌కప్‌లలో కనీసం సెమీస్ చేరిన భారత్ ఉమెన్స్ టీమ్.. ఈ సారి కనీసం సెమీస్ గడప కూడా తొక్కలేదు టీమ్ బలాబలాలు, ఫామ్, ర్యాంక్‌ను బట్టి చూసుకుంటే మన జట్టు కచ్చితంగా సెమీస్‌కి చేరాలి. కానీ.తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌తో ఓడి.. ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్‌పై గెలిచినా ఆఖర్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో పాక్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.చివరికి సోమవారం దాయాది దేశం హ్యాండివ్వడంతో నిరాశగా భారత్ మహిళల జట్టు ఇంటిబాట పట్టింది. ఒకవేళ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై లేదా ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు గెలిచి ఉన్నా ఈరోజు దర్జాగా సెమీస్‌కి చేరేది.