తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప దీక్షా స్వాముల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మండల దీక్ష చేపట్టిన దీక్ష స్వాములు ఎక్కువ సంఖ్యలో రైళ్లలోనే శబరిమలకు వెళ్లి స్వామివారికి ఇరుముడి సమర్పించి దీక్ష విరమించడం జరుగుతోంది. ఏపీ, తెలంగాణ నుండి శబరిమలకు వెళ్లే భక్తులు ముందుగానే ట్రైన్ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవడంతో రెగ్యులర్ ట్రైన్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖ, శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో విశాఖపట్నం నుంచి కొల్లం ప్రత్యేక రైళ్లు (08539/08540) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకు 26 సర్వీసులు అందించనున్నాయి.
Share