Current Date: 02 Jul, 2024

పుష్ప-2లో త్రిప్తితో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్!

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా అంచనాలకు మించి ఆడియన్స్‌ను థ్రిల్ చేసేలా ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ఫిక్స్ అయ్యాడు. అందుకే సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు.పుష్ప 1లో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ సూపర్ హిట్ కాగా పుష్ప 2 లో అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం ఎంతోమంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. లేటెస్ట్ గా పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం యానిమల్ బ్యూటీని ఫైనల్ చేశారని అంటున్నారు.యానిమల్ సినిమాలో చేసిన చిన్న పాత్రతోనే సంచలనం సృష్టించింది త్రిప్తి డిమ్రి. హీరోయిన్ రష్మిక కన్నా త్రిప్తికి ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ లోనే కాదు త్రిప్తికి సౌత్ లో కూడా సూపర్ డిమాండ్ ఏర్పడింది. అదే బజ్ తో పుష్ప 2లో ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించాలని చూస్తున్నారట. పుష్ప 2 లో త్రిప్తితో ఐటెం సాంగ్ చేయిస్తే అది ఉ అంటావాని మించి ఉంటుందని అంటున్నారు.