రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని చోట్ల తేలికపాటి, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఇవి కొనసాగనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకొని ఈ నెల 26 నుంచి వానలు మరింత జోరందుకోనున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.