Current Date: 05 Aug, 2026

చెన్నై-విశాఖ ట్రావెల్స్ బస్సు బోల్తా..! 25 మందికి గాయాలు... 7 మంది పరిస్థితి విషమం..!

చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న బీఎల్‌ఎం (BLM) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురైంది.
ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో అదుపుతప్పిన బస్సు డివైడర్‌పై పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది గాయపడినట్లు సమాచారం. వారిలో 18 మందికి స్వల్ప గాయాలు కాగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను పిన్నమనేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అట్కూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.