Current Date: 05 Oct, 2024

‘రైటర్స్‌ అకాడమీ’ ఆధ్వర్యంలో 22న ఉత్తరాంధ్ర జాతర

ఈ నెల 22న విశాఖలో జరగనున్న ఉత్తరాంధ్ర జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాతరలో సుమారు 50రకాల ఉత్తరాంధ్ర వాడుకలో ఉన్న కళల్ని ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా విశాఖ బీచ్‌రోడ్డులో కళా జాత కూడా ఉండనుంది. నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమేడియన్‌ బ్రహ్మానందం సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపనథ్యంలో శుక్రవారం నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంకభ్రత బగ్జీ ఉత్తరాంధ్ర జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే 22న విశాఖ బీచ్‌లో సుమారు 3వేల మంది కళాకారులతో ర్యాలీ కూడా ఉంటుందని,  సదరు ర్యాలీని పోలీస్‌ కమిషనర్‌ ప్రారంభిస్తారని నిర్వాహకులు ఆ ప్రకటనలో తెలిపారు. అందుకు సీపీ తన సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఆ తర్వాత స్పెషల్‌ బ్రాంచీ ఏసీపీ కింజరాపు ప్రభాకర్‌ కూడా పోస్టర్‌ను ఆహానించారు. కార్యక్రమంలో రైటర్స్‌ అకాడమీ అధ్యక్షులు వీవీ రమణమూర్తి, కార్యక్రమ ఆహ్వాన కమిటీ ధనుంజయ్‌, రచయిత మేడా మస్తాన్‌ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Share