Current Date: 27 Nov, 2024

అత్యాచార నిందితుడికి 20ఏళ్ల జైలుతీర్పు చెప్పిన విశాఖ స్పెషల్ పొక్సో కోర్టు

విశాఖలోని స్పెషల్ పోక్సో కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2021లో ఎయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలికపై పక్కింట్లో ఉంటున్న అప్పన్న అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడడంత నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1లక్ష జరిమానా చెల్లించాలని, అదే విధంగా బాధితురాలికి ప్రభుత్వం తరుపున రూ.3 లక్ష నష్ట పరిహరం అందజేయాలని ఆదేశించింది.

Share