Current Date: 07 Jun, 2026

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల టైమ్

 వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో, సర్వదర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ ఉంది. దీంతో దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 90,107 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 4.35 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. రూ.4.23 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.