టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా సగర్వంగా సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అంతేకాదు వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంటూ ఆస్ట్రేలియా టీమ్ సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసింది.టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు మోస్తరు ప్రదర్శన చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. 41 బంతుల్లో 92 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేసింది. కానీ భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీయడంతో చివరికి ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 181/7కే పరిమితమైంది.ఈ ఫలితంతో భారత్ సెమీస్ చేరింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే అప్ఘానిస్థాన్ కూడా సెమీస్ చేరనుంది.
Share