Current Date: 27 Nov, 2024

బంగ్లాదేశ్‌‌తో తొలి టీ20లో భారత్ ఫాస్ట్ బౌలర్ అరుదైన రికార్డ్

భారత్ జట్టు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను మెయిడెన్ ఓవర్‌తో యాదవ్ ప్రారంభించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్‌.. ఎటువంటి పరుగులు ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్‌గా ఈ మయాంక్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపై, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పై ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఆదివారం రాత్రి మ్యాచ్‌లో ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్‌ 21 పరుగులిచ్చి ఓ కీలక వికెట్‌ సాధించాడు.

Share