ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచింది.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ అమ్మాయిలు విశ్వవిజేతగా నిలిచారు. మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. ఆ తరువాత దక్షిణాఫ్రికా జట్టు లక్ష్య చేధనలో విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.దాంతో 32 పరుగుల తేడాతో కివీస్ జట్టు విజయం సాధించింది. పురుషులు, మహిళల క్రికెట్ రెండింట్లోనూ న్యూజిలాండ్ నెగ్గిన తొలి టీ20 ప్రపంచకప్ ఇదే కావటం గమనార్హం. మహిళల న్యూజిలాండ్ జట్టు 2009, 2010లో రన్నరప్ గా నిలిచింది. పురుషుల జట్టు 2021 ఫైనల్లో ఓడింది. వన్డే ప్రపంచకప్లో మాత్రం అమ్మాయిల జట్టు 2000 సంవత్సరంలో విజేతగా నిలవగా.. పురుషుల జట్టు ఇప్పటి వరకు ఏదీ గెలవలేదు. మరోవైపు గత 20 నెలల కాలంలో దక్షిణాఫ్రికా పురుషులు, ఇటు మహిళలు కలిపి మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరినా.. అన్నిసార్లూ ఓటమి తప్పలేదు. తాజాగా న్యూజిలాండ్ వుమెన్స టీమ్ చేతుల్లోనే సౌతాఫ్రికా ఫైనల్లో ఓడిపోయింది.