Current Date: 02 Jul, 2024

టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ ఔట్ బ్యాడ్‌లక్ అంటే ఇదే!

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి పాకిస్థాన్‌ నిష్క్రమించింది. టోర్నీ ప్రారంభానికి ముందు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా కనిపించిన ఆ జట్టు.. అనూహ్యంగా లీగ్‌ దశలోనే పేలవ ప్రదర్శనతో ఇంటి బాట పట్టింది.ఫ్లోరిడా వేదికగా శుక్రవారం జరగాల్సిన అమెరికా- ఐర్లాండ్‌ మ్యాచ్‌.. వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో రెండు జట్లకూ చెరొక పాయింట్‌ కేటాయించారు. ఫలితంగా లీగ్ స్టేజ్‌లో 5 పాయింట్లతో అమెరికా.. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. దాంతో పాక్ ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన పాక్.. ఆ తర్వాత భారత్‌ చేతిలోనూ ఓడిపోయింది. దీంతో సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Share