Current Date: 04 Jul, 2024

టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్...

టీ20 వరల్డ్ కప్2024లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్థాన్ మట్టి కరిపించింది. ఏకంగా 84 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆఫ్ఘనిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన రికార్డు నెలకొల్పాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి తన జట్టుని విజయ తీరాలకు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో రషీద్ ఖాన్ సంచలన రికార్డు సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కెప్టెన్‌గా నిలిచాడు.

Share